బద్రీనాథ్ యాత్రకు బేక్..
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల వల్ల బద్రీనాథ్ యాత్రకు బ్రేక్ పడిరది. రాబోయే రెండు రోజుల పాటు చార్ధామ్తో సహా ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బద్రినాథ్ యాత్ర పాండుకేశ్వర్ వద్ద ఆగిపోయింది. భారీ వర్షాల వల్ల వరదలు వెల్తువెత్తుతుండటంతో ప్రజలు నదులు, కాల్వలకు దూరంగా ఉండాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.













