ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఢిల్లీలోని గోల్ మార్కెట్ సమీపంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్థానిక సలహా మండలి సభ్యులు చంద్రశేఖర్, మదన్మోహన్, జయ కుమార్ సహా ఇతర సభ్యులతో కలిసి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మే 3న అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని, మే 8న కల్యాణోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 3 నుంచి 8 మధ్య జమ్మూలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.













