ఆ దేశం నుంచి దిగుమతులను ఆపండి
భారత సైనికులపై చైనా దాడులకు పాల్పడుతున్నప్పటికీ ఆ దేశం నుంచి దిగుమతులను కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రశ్నించారు. పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. సరిహద్దుల్లో చైనా దూకుడు పెరుగుతున్నా కేంద్రం అంతా సవ్వంగా ఉందనే చెప్తోందన్నారు. ఆ దేశాన్ని శిక్షించడానికి బదులు భారీ మొత్తంలో దిగుమతులను ఇంక అనుమతించడమేంటని విమర్శించారు. దిగుమతులకు ఆపేస్తే మన దేశం విలువేంటో చైనాకు తెలిసోస్తుందని అన్నారు. ఆ దేశ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు.













