మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు.. తమ వద్ద ఆధారాలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం లను హ్యాక్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోన్న విపత్తులు, మతపరమైన ఉద్రిక్తతలు, నిరుద్యోగం నుంచి విపక్ష కూటమి ఇండియా మాత్రమే కాపాడుతుందని దీదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టిందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లకు హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తమకు తెలిసిందన్నారు. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని, మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.













