బీజేపీ ఈ పని చేయకపోతే.. జీఎస్టీ వచ్చేది కాదు
దేశంలో ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఈ పని చేయకపోతే వివిధ ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలిన అవసరం వచ్చేది కాదన్నారు. జీఎస్టీతో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనేందుకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తుండటంతోనే ధరల పెరుగుదల సమస్య వచ్చిందని ధ్వజమెత్తారు.













