కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు … ఆయన ఇప్పుడో, అప్పుడో
ఆర్థిక అవకతవలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఫ్రాడ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ ఏ క్షణాన అయినా బీజేపీలో చేరతారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు జైలు నుంచే లేఖలు రాస్తూ అరవింద్ కేజ్రీవాల్‌పై సుకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ సుకేశ్ ఎప్పుడైనా బీజేపీలో చేరొచ్చని అన్నారు. సుకేశ్ బీజేపీ భాషను నేర్చుకుంటున్నారని విమర్శించారు. కేజ్రీవాల్‌కు లై డిటెక్టర్ టెస్టు నిర్వహించాలని చివరికి బీజేపీ కూడా చెబుతోందని, ఇప్పుడు సుకేశ్ బీజేపీలో చేరేందుకు శిక్షణ పొందుతున్నారని అన్నారు. ఆయన ఇప్పుడో, అప్పడో బీజేపీలో చేరడం పక్కా అని అన్నారు. సుకేశ్‌ను బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా చేయాలి. అప్పుడైనా ర్యాలీల్లో ప్రజలు చూసి, ఆయన చెప్పే కథలు వింటారు. కనీసం అలాగైనా బీజేపీ ర్యాలీలకు జనం వస్తారు. సుకేశ్‌ను వెంటనే పార్టీలో చేరుకుని పార్టీ చీఫ్‌ను చేయాలి అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.













