లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం!

సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. గుజరాత్ లోని సూరత్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి దలాల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురువడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్ విజయానికి మార్గం సుగమైంది. సూరత్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలేశ్ కంభీనీ నామిషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రాతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌వో వెల్లడిరచారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి వేసిన మరో నామినేషన్ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. మరోవైపు ఇదే స్థానం నుంచి దిగిన మిగతా 8 మంది తమ నామిసేషన్లను ఉపసంహరించుకున్నారు.