సచిన్ పైలట్ ను బీజేపీలోకి స్వాగతిస్తాం
రాజస్థాన్‌లో తాజా పరిణామాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించింది. ఈ సమయంలో సచిన్ పైలట్‌ను బీజేపీలోకి స్వాగతిస్తామని ఆ పార్టీ నేత ఓం మథూర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయనకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. బీజేపీలో చేరాలని భావించే ఎవరికైనా తాము స్వాగతం పలుకుతామని ఓం మాథుర్ తెలిపారు. సచిన్ పైలట్, సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య వివాదం కాంగ్రెస్ అంతర్గత విషయమని, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ సచిన్ బీజేపీలో చేరితే ఆయనకు సీఎం పదవి క•్టబెట్టే అంశాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తుందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు ఉన్నదని సీఎం అశోక్ గెహ్లాట్ భావిస్తే ఆయన వెంటనే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని ఓం మథూర్ డిమాండ్ చేశారు.













