9 మంది సభ్యులతో మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ.. అన్నామలై, తమిళిసై సీట్లు కన్ఫర్మ్
లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికార పక్షమైన బీజేపీ కూడా తాజాగా తొమ్మిది మంది సభ్యులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై తదితరులు ఉన్నారు. అన్నామలైను కోయంబత్తూరు నుంచి, తమిళిసైను చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంచుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే నీలగిరి నుంచి ఎల్ మురుగన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ సెల్వం, వేలూరు నుంచి ఏపీ షణ్ముగం, కృష్ణగిరి నుంచి సీ నరసింహన్, పెరంబలూరు నుంచి టీఆర్ పరివేందర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి పాన్ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నట్లు బీజేపీ అధికారికంగా ప్రకటించింది.













