హాట్ టాపిక్ గా సురేష్ ప్రభు లేఖ
ఆంధప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు తాజాగా కేంద్రానికి రాసిన ఓ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏన్డీఏ వైసీపీ మిత్రపక్షాలు కాకపోయినా ప్రతి దశలోనూ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. లోక్సభ, రాజ్యసభల్లో బిల్లులు పాస్ కావడానికి వైసీపీ కేంద్రానికి సహకరిస్తూ ఉంటుంది. అయితే ఏపీలో ఆర్థికపరిస్థితి ఏమీ బాగాలేదని.. సీఎం జగన్ కార్పొరేషన్ నిధులను దారిమళ్లిస్తున్నారంటూ సురేష్ ప్రభు కేంద్రానికి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. జగన్ నిర్ణయాలతో ఏపీ ఆర్థికపరిస్థితి దిగజారిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.













