మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు సంచలన ప్రకటన.. దానిపై ఆంక్షలేవు
మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ సంచలన ప్రకటన చేశారు. మేఘాలయాలో దాదాపు ప్రతిఒక్కరూ గొడ్డు (బీఫ్) మాంసం తింటారని వెల్లడించారు. బీఫ్ తినడంపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఇది తమ ఆహార అలవాటు, సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. మేఘాలయలో, మాకు కబేలా ఉంది. ప్రతి ఒక్కరూ ఆవు లేదా పందిని తీసుకొని మార్కెట్కు తీసుకువస్తారు. వీటిని పరిశుభ్రంగా ఉంచుతారు. అందుకే ఇక్కడి వారికి తినే అలవాటు ఉంది అని అన్నారు. ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై తనేం మాట్లాడదలుచుకోలేదని తెలిపారు.













