37 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేసిన బీజేపీ
గుజరాత్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి విజయం సాధించడంతో పాటు 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి అత్యధిక స్థానాలతో బీజేపీ సరికొత్త చరిత్ర లిఖించింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాషాయ పార్టీ ఏకంగా 156 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1985లో కాంగ్రెస్ అప్పటి నేత మాథవ్సిన్హ్ సోలంకీ సారథ్యంలో అత్యధికంగా 149 సీట్లతో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును బీజేపీ బ్రేక్ చేసింది.













