సంకల్ప్ పత్ర.. బీజేపీ మేనిఫెస్టో హామీలు..
లోక్సభ ఎన్నికలు – 2024కు సంబంధించి బీజేపీ సంకల్ప్ పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో పేదలు, యువత ,మహిళలు, రైతులకు సంబంధించిన అభివృద్ధి గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. వీళ్ళందర్నీ కలిపి ‘గ్యాన్’( GYAN) మేనిఫెస్టోని బీజేపీ రూపొందించింది. ఇక ఇందులో పలు కీలక హామీలు ప్రజలను ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇంటింటికి వంట గ్యాస్ ను పైప్ లైన్ ద్వారా భవిష్యత్తులో అందించే విధంగా ప్రధాన మోదీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన గత పది సంవత్సరాలలో పాతిక కోట్ల మందికి పేదరికం నుండి విముక్తి కలిగించామని.. రాబోయే ఐదు సంవత్సరాలలో మరింతమంది పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని మోదీ పేర్కొన్నారు. గత పది సంవత్సరాలలో నాలుగు కోట్ల ఇల్లు కట్టించిన తమ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలలో మరొక మూడు కోట్ల గృహాల నిర్మాణం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఐదు లక్షలకు ఉచిత వైద్యం అందించే విధంగా స్కీమ్స్ ని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు ధరల విషయంలో కూడా ఫోకస్ పెడతామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని చెప్పారు.













