ఇది దేశ ప్రయోజానాల కోసం ఇచ్చిన.. చరిత్రాత్మక తీర్పు
పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు గా అభివర్ణించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించింది. 2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించిన విషయం తెలిసింది. జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4.1 మెజారిటీతో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది.













