బీజేపీ కీలక నిర్ణయం… తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు ఎన్నికలకు ఇన్ఛార్జ్ లు
తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అధిష్టానం కీలక మార్పులు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమించింది బీజేపీ. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ ను నియమించిన బీజేపీ, సునీల్ బన్సల్ సహాయ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ ఇన్ఛార్జిగా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్గా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను సహాయ ఇన్ఛార్జిగా నియమించింది. ఛత్తీస్‌గఢ్‌కు ఓం ప్రకాశ్ ఓపీ మాథూర్, సహాయ ఇన్ఛార్జిగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయను నియమించింది. ఈ నియామకాలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేపట్టినట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.













