ఫలించిన ఆర్జేడీ నేత తేజస్వీ కోరిక
బిహార్ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడి నేత తేజస్వి యాదవ్, రాజశ్రీ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని తేజస్వి అందరితో పంచుకున్నారు. దీంతో పాటు కుమార్తెను చేతుల్లో పట్టుకుని మురిపెంగా చూస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ శుభవార్తతో తేజస్వీ కుటుంబ సభ్యుల తేజస్వి సోదరుడు తేజ్‌ప్రతాప్ అసెంబ్లీ అవరణలో మిఠాయిలు పంచారు. నేను పెదనాన్నను అయ్యాను. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో తేజస్వి మాట్లాడుతూ తనకు తొలి సంతానంగా అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన కోరిక ఫలించి ఆడబిడ్డ జన్మించింది.













