రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ కుమార్ ?
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా? ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత సవాబ్ మాలిక్ ఇదే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి సమిష్టిగా ఓ నిర్ణయానికి వస్తామన్నారు. అయితే ఇంతటి ఉన్నతమైన రాజ్యాంగబద్ధ పదవికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉందన్నారు. అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటనే రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించే ఛాన్స్ ఉంటుందని నవాబ్ మాలిక్ తేల్చి చెప్పారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్‌ను బరిలోకి దించే విషయం ఆయనతో ఇప్పటి వరకూ చర్చించలేదు. అయితే ఆయన బరిలోకి దిగుతున్నారన్న వార్తలు మాత్రం వస్తున్నాయి. మొదట ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ అంశం ప్రస్తావనకు తెస్తాం. ప్రతిపక్ష పార్టీలన్నీ ఓ చోట కూర్చొని, ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.













