శివసేన ఎంపీ సంచలన ప్రకటన… 24 గంటల్లో
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 24 గంటల్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే కూటమి నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. తమ డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. రెబల్స్ ఎమ్మెల్యేలతో 21 మంది తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. వాళ్లంతా ముంబై చేరుకున్నాక పరిస్థితులు చక్కబడతాయన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి కమ్యూనికేట్ చేయకూడదు. ముంబై తిరిగి వచ్చిన సీఎంతో చర్చించాలి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు. బలపరీక్ష జరిగినప్పుడు అందరూ చూస్తారని, బలపరీక్షలో అధికార కూటమి మహా వికాస్ అఘాడి గెలుస్తుంది. శివసేనకు ద్రోహం చేయాలనుకునేవారు బాల్థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరు అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.













