డిసెంబర్ లో భారత్ జోడో యాత్ర 2.0!
భారత్ జోడో యాత్ర మలి విడత యాత్రకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేపట్టింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా డిసెంబర్`ఫిబ్రవరిలోగా భారత్ జోడో యాత్ర 2.0ను ప్రారంభించేందుకు ఆ పార్టీ కసరత్తు సాగిస్తోంది. రాహుల్ గాంధీ సారధ్యంలో సాగే మలి విడత యాత్రలో భాగస్వాములయ్యే వారు కాలినడకన ఆపై వాహనాలనూ ఉపయోగించేలా హైబ్రిడ్ మోడ్లో సాగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. భారత్ జోడో యాత్ర తొలి దశ 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కశ్మీర్లోని శ్రీనగర్లో 2023 జనవరిలో ముగిసింది. ఈ యాత్ర 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల మీదుగా 126 రోజుల పాటు కొనసాగింది.













