రాజస్థాన్ నూతన సీఎంగా.. భజన్‌లాల్ శర్మ ప్రమాణం
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్బర్ట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ కల్రాజ్ మిశ్ర ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక దియా సింగ్ కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత వసుంధర రాజే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ గహ్లోత్ తదితరులు హాజరయ్యారు.













