విశ్వాస పరీక్షలో నెగ్గిన పంజాబ్ మాన్ ప్రభుత్వం
పంజాబ్లో తమ ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల్లో విశ్వాసం ఉన్నదని స్పష్టం చేసేందుకు భగవంత్ మాన్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నాడు. పంజాబ్ అసెంబ్లీలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ విశ్వాస పరీక్ష నిర్వహించగా 90 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేశారు. ఒక్కరూ కూడా మాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. దాంతో విశ్వాస తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ కూటమి ఎమ్మెల్యేలు సభలోనే ఉన్నప్పటికీ విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. మాన్ ప్రభుత్వానికి అనుకూలంగా 93 మంది ఓటేయగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదు కాకపోవడం విశేషం.













