భారత్ లో యూఎస్ తరహా నిరసనలు
ప్రముఖ హక్కుల క్యాకర్త, అమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ చీఫ్ ఆకార్ పటేల్‌పై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. యూఎస్‌లో ఆఫ్రో అమెరికాన్ జార్జి ఫ్లాయిడ్ ఘటనానంతరం అక్కడ నల్లజాతీయులు చేపడుతున్న నిరసనల తరహాలో భారత్‌లోనూ ముస్లింలు, దళితులు, ఆదివాసులు, మహిళలు వారిని అనుకరించాలి ట్వీట్ చేసినందుకు గానూ ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆకార్ పటేల్ ట్వీట్‌ను ఆధారంగా తీసుకున్న జేసీ నగర్ (బెంగళూరు) పోలీసులు.. ఆయనపై ఐపీసీ సెక్షన్ 505 (1) బీ, 153, 117ల ప్రకారం కేసు నమోదు చేశారు. దీనిపై పటేల్ స్పందిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలైన విషయం తనకు తెలియదనీ, ఇది ఎక్కడి వరకు వెళ్తుందోనని అన్నారు.













