బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. అధికారులు ముమ్మర సోదాలు నిర్వహించి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు బీబీసీ సిబ్బంది సెల్ఫోన్లను కూడా సీజ్ చేసి వాళ్లను ఇళ్లకు పంపినట్లు తెలుస్తోంది. అటు ముంబైలోని బీబీసీ కార్యాలయంలోని ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు ద్వారా తెలిసింది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోదీపై బీబీసీ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద వీడియోను కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విటర్లో ఇందుకు సంబంధించిన లింకులను బ్లాక్ చేసింది. మరోవైపు బీబీసీని బ్యాన్ చేయాలనే పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. అయితే దీనిపై అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.













