పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజీనామా
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలకు సైతం ఆయన రాజీనామా చేశారు. భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్గా 2021 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. 2017 నుండి 2021 వరకు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు. 2016 నుంచి 2017 వరకు అసోం గవర్నర్గా పని చేశారు. బన్వరీలాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.













