అయోధ్య రామయ్యకు కొత్త పేరు.. ఇకపై
శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్య లోని నవ నిర్మిత భవ్య మందిరంలో రామయ్య కొలువుదీరాడు. ప్రధాని చేతులమీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన రామ్లల్లాను ఇకపై బాలక్ రామ్ గా పిలవనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. జనవరి 22న ప్రతిష్టించిన శ్రీరాముడి విగ్రహానికి బలాక్ రామ్ గా పేరు పెట్టాం. అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ పేరును నిర్ణయించాం. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తాం అని ఆయన పేర్కొన్నారు.













