గిన్నిస్ బుక్లోకి అయోధ్య
దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దీపకాంతులతో వెలుగులు విరజిమ్మింది. అంతేకాదు ప్రపంచ రికార్డు కూడా సాధించింది. 9 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య నగరం గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. దీపావళిని పురస్కరించుకుని ఇక్కడి సరయు నదీ తీరంలో దీపోత్సవం కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారే లక్షల దీపాలు ప్రజ్వలనం చేయడంతో ఆ ప్రాంతమంతా కన్నుల పండువలా మారింది. ఇక్కడి రామ్ కీ పైడీ ప్రాంతంలో ఇలా చమురుతో దివ్వెలు వెలిగించడం వరుసగా ఐదోసారి కూడా గిన్నిస్ రికార్డు పుట్టల్లోకెక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ దీపోత్సవం నిర్వహించారు. రికార్డు సాధించినట్టు నిర్ధారించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆ మేరకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.













