దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రాష్ట్రపతి భవన్లో !
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈసారి రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ వేడుకను రద్దు చేసినట్లు సమాచారం. సాధారణంగా స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సహా సుమారు రెండు వేల మందికి రాష్ట్రపతి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనైనా ఎట్ హోమ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఆది కూడా సాధ్యపడకపోవడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ వేడుకను రద్దు చేసినట్లు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ సింగ్ తెలిపారు. ఎట్ హోమ్ కార్యక్రమం రద్దు కావడం కూడా దేశ చరిత్రలో ఇది తొలిసారి కావచ్చని రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడిరచారు.













