విశ్వాస తీర్మానంలో గట్టెక్కిన గెహ్లాట్ సర్కార్
కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్లో రాజకీయ క్రీడ ప్రారంభమైంది. గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న సచిన్ పైలట్ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీలు రంగప్రవేశం చేయడంతో సచిన్ పైలట్ కాస్త మెత్తపడ్డారు. ఈరోజు నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజునే ప్రతిపక్ష పార్టీ బీజేపీ గెహ్లాట్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పరీక్షలో గెహ్లాట్ సర్కార్ మూజువాణి ఓటుతో గట్టెక్కింది.













