నిద్ర కోసం అమెరికాలో గంజాయి…ఎన్సీబీ విచారణలో
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గంజాయి వినియోగించే అలవాటు తనకు గతంలో ఉందని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దర్యాప్తు సమయంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల ముందు ఆర్యన్ ఈ విషయాన్ని ఒప్పకున్నట్లు ముంబై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో వెల్లడైంది. ముంబై క్రూయిజ్ నౌకలో మాదకద్రవ్యాల పట్టివేత కేసులో గతంలో నిందితుడిగా ఉన్న ఆర్యన్ సహా 14 మందిపై ఎన్సీబీఐ ముంబై కోర్టు ఛార్జిషీట్ సమర్పించింది. 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదివే రోజుల్లో నిద్ర సంబంధ సమస్యలతో సతమతమయ్యాయ. అందుకే అక్కడ ఉన్నపుడే గంజాయి సేవించం అలవాటు చేసుకున్నా. గంజాయితో నిద్ర సమస్యలు పోతాయని ఇంటర్నెట్లో కథనాలు చదవి అలా చేశా అని ఆర్యన్ పేర్కొన్నట్లు చార్జిషీట్లో ఉంది. డ్రగ్స్ కోసం తన ఫోన్లో వాట్పాప్ చాట్ ను చేసింది తానేని ఆర్యన్ అంగీకరించాడు. అయితే ఈ చాటింగ్‌కు ఈ క్రూయిష్షిప్ కేసుకు సంబంధంలేదని ఎన్సీబీ స్పష్టం చేసింది.













