కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు
మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీసీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న విచారణకు రావాలని ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. గత నాలుగు నెలల వ్యవధిలో కేజ్రీవాల్‌కు ఈడీ ఐదు సార్లు సమన్లు జారీ చేయగా, ఆయన గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఈడీ అధికారులు మరోసారి సమన్లు పంపారు. తొలుత గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో విచారణకు రావాలంటూ ఐదు దఫాలుగా ఈడీ నోటీసులు జారీ చేయగా, వివిధ కారణాలు చూపి కేజ్రీవాల్ గైర్హాజరైన విషయం తెలిసిందే.













