సెల్ఫ్ క్యారెంటైన్ లోకి అరవింద్ కేజ్రీవాల్..ఎందుకంటే
దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమెతోపాటు ఆయన కూడా హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని వారు మీడియాకు వెల్లడించారు. ఇటీవల తమను కలిసిన మిత్రులు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కొన్నిరోజుల పాటు హోమ్ క్వారెంటైన్లో ఉండాలని సునీతా కేజ్రీవాల్ సూచించారు.













