సిసోడియా అరెస్టు సీబీఐ అధికారులకే నచ్చలేదు : కేజ్రీవాల్
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదని, చాలా మంది సీబీఐ అధికారులు మనీశ్ అరెస్టుపై వ్యతిరేక భావనతో ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు సిసోడియాను అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా మనీశ్ సిసోడియాను తమ కార్యాలయానికి పిలిచిన సీబీఐ అధికారులు, దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు.













