ఆప్ కీలక నిర్ణయం.. గుజరాత్ సీఎం అభ్యర్థిగా
పంజాబ్ తరహాలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్‌గా పనిచేసిన ఇసుదాన్ గడ్వీని ఎంపిక చేసింది. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ తరహాలోనే గుజరాత్‌లోనూ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్ నిర్వహించిన పోల్‌లో 40 ఏళ్ల గడ్వీకి 73 శాతం ఓట్లు వచ్చాయని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ రేసులో పాటిదార్ కమ్యూనిటీ ఆందోళనలో కీలక పాత్ర పోషించిన ఆప్ గుజరాత్ ఇన్‌ఛార్జి గోపాల్ ఇటాలియా కూడా ఉన్నప్పటికీ గుజరాతీయలు గఢ్వీ వైపే మొగ్గు చూపారు. గఢ్వీ ద్వారకా జిల్లా పిపాలియా గ్రామంలోని ఓ రైతు కుటుంబలో జన్మించారు. అలాగే గుజరాత్ జనాభాలో 40 శాతంగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. గఢ్వీ గుజరాత్లో అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ జర్నలిస్టు. యాంకర్లలో ఒకరుగా ఉన్నారు.













