ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల పోటోలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. లక్ష్మీదేవి ఫోటో కరెన్సీ నోటుపై ఉంటే దేశప్రజలకు ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటానికి దోహదపడుతుందని తెలిపారు. కష్టాలను దూరం చేసే దేవుడిగా పేరున్న వినాయకుడి ఫోటోతో ప్రజలు సమస్యలు తీరుతాయన్నారు. ఇండోనేసియా లాంటి దేశంలోనూ కరెన్సీపై వినాయకుడి ఫొటోను ముద్రిస్తున్నట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. అక్కడ 20 వేల నోటుపై గణేషుడి ఫోటో ఉంటుంది.













