వారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో : కేజ్రీవాల్
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలతో తన నివాసంలో క్రేజీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల ఆఫర్‌తో తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. 40 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.800 కోట్లు అవుతుందని, అంత డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లను బీజేపీ ఆఫర్ చేసిందన్నారు. ఢల్లీి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వారు రూ.800 కోట్లు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. వారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని దేశ ప్రజలను కోరుకుంటున్నాను. అది జీఎస్టీ లేదా పీఎం కేర్స్ నుంచి తీసినా డబ్బా. లేదా వారి మిత్రులు ఇచ్చిన ధనమా? అంటూ ప్రశ్నించారు.













