కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు .. ఢిల్లీ లిక్కర్ కేసులో
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఇటీవల తనకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌ను నవంబర్ 2న హాజరు కావాలని సమన్లలో ఈడీ కోరింది. అయితే తనపై రాజకీయ కక్ష సాధింపుతోనే సమన్లు జారీ చేశారని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈడీ తనకు సమన్లు జారీ చేసిందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. ఇదే కేసులో ఈడీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది.













