మంత్రి పార్థా ఛటర్జీకి షాక్ ఇచ్చిన మమత బెనర్జీ
టీచర్ నియామక కుంభకోణంలో అరెస్టయిన మంత్రి పార్థా చటర్జీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. పార్థా చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించే విషయమై రాష్ట్ర క్యాబినెట్లో ఎటువంటి చర్చ జరుగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీచర్ల నియామకానికి సంబంధించిన కేసులో ఛటర్జీ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వాణిజ్యం, పరిశ్రమల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రికన్్టక్షన్ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ చెప్పలేం అని మమత పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు.













