భారత సైన్యం మరో కీలక నిర్ణయం
భారత సైన్యానికి చెందిన అర్టిలరి రెజిమెంట్ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగం కానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరపున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన త్వరలోనే ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి యుద్ధ పరిస్థితుల్లోనైనా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్ కీలక పాత్ర పోఫిస్తుంది. ఇది ఇండియన్ ఆర్మీలో రెండో అతిపెద్ద బ్రాంచ్. భారత సైన్యానికి గ్రౌండ్ ఆపరేషన్స్‌లో సహాయం అందిస్తుంది. ఆర్టిలరి రెజిమెంట్‌ను ప్రధానంగా రెండు భాగాలు విభజించారు. మొదటి భాగం ప్రాణాంతక ఆయుధాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో క్షిపణులు, రాకెట్లు, మోర్టార్లు, తుపాకులు, ఫిరంగులున్నాయి. మరో భాగంగాలో డ్రోన్, రాడార్, నిఘా వ్యవస్థ ఉంటాయి. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ రిజిమెంట్ శత్రువులపై దాడి చేసి భారీగా ప్రాణనష్టం కలిగించింది.













