ఇండియన్ ఆర్మీలో చారిత్రాత్మక ఘట్టం
ఇండియన్ ఆర్మీలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భార్యాభర్తలైన ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో పాల్గొననున్నారు. కర్తవ్య పథ్ వద్ద నిర్వహించే పరేడ్‌లో వేర్వేరు కాంటిజెంట్స్‌లో వీరు పరేడ్‌కు నాయకత్వం వహించనున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ రిపబ్లికన్ డే వేడుకల పాల్గొనడం ఇండియన్ ఆర్మీలో ఇదే తొలిసారి. మేజర్ జెర్రీ బ్లెయిజ్ మద్రాస్ రెజిమెంట్‌లో మిలటరీ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కెప్టెన్ సుప్రీత సీటీ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌లో పని చేస్తున్నారు. అయితే వీరిద్దరూ 2023, జూన్‌లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇద్దరు కలిసి పాల్గొనబోతున్నారు.













