కేంద్ర ఎన్నికల కమిషనర్ గా … అనూప్ చంద్ర

కేంద్ర ఎన్నికల కమిషనర్‍గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‍నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. అనూప్ చంద్ర 1984 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ అధికారి. ఆయన నియామకంతో ఎన్నికల సంఘంలో పూర్తిస్థాయిలో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. ప్రస్తుతం సునీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‍గా కాగా, రాజీవ్‍కుమార్ మరో సభ్యుడిగా ఉన్నారు. అనూప్ చంద్ర గతంలో యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.