అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ .. వెడ్డింగ్ కార్డు ఇదే

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న తనయుడు అనంత్ అంబానీ-రాదికా మర్చంట్ వెడ్డింగ్ కార్డుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు స్వయంగా ప్రముఖులను కలిసి తనయుడి వివాహ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు. అనంత్-రాధిక వివాహం జులై 12న జరగనుంది. వెడ్డింగ్ కార్డును ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. కార్డుపై ప్రత్యేకంగా వెండితో చేసిన మందిర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వినాయకుడితో పాటు, రాధాకృష్ణుల ప్రతిమను ఉంచారు. వెడ్డింగ్ కార్డును ఒక సిల్వర్ బాక్స్‌లో స్వీట్స్, ప్రూట్స్ పెట్టి అందిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రేయిటీలను, క్రీడా రంగ ప్రముఖులను, వ్యాపార, వాణిజ్య వేత్తలను ఆహ్వానించారు. వీరికి ఈ ప్రత్యేక వెడ్డింగ్ కార్డులను అందించారు. పెళ్లి వేడుకులకు సంబంధించి పూజా కార్యక్రమాలు జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి.