ముంబై జియో వరల్డ్ ప్లాజా లో అనంత్-రాధికల వెడ్డింగ్

అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట ఈ ఏడాది సందడి వాతావరణం కొనసాగుతోంది. ముకేశ్-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి వివాహానికి ముహూర్తం కుదిరింది. జులై 12న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ ఫ్యామిలీ నిశ్చయించింది.
ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జియో వరల్డ్ ప్లాజా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వివాహ తంతు జులై 12న మొదలై జులై 14న మంగళ ఉత్సవ్ (రిసెప్షన్)తో ముగియనుంది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ తారలు సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.