అంబాని ఇంట పెళ్లి సందడి … అనంత్-రాధిక వివాహ వేడుకలు!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో ఈ సంబరాలు షూరు అవుతున్నాయి. జూన్ 29న ముంబయిలోని ముకేశ్ నివాసం ఆంటీలియాలో నిర్వహించనున్న పూజా కార్యక్రమంతో వారి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జులై 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి పెళ్లి జరగనుంది. జులై 14న అతిథులకు విందు ఇవ్వనున్నారు. దీనికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రముఖ డిజైనర్లు వివాహ దుస్తుల్ని డిజైన్ చేసే పనిలో ఉన్నారు. ముందస్తు వేడుకలే ఎంతో అట్టహాసంగా జరగ్గా, ఇక పెళ్లి ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొనింది.