అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు…. హాజరైన ప్రముఖులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకులు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబతో పాటు, విదేశీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకల్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈవెంట్‌కు తగ్గట్టు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అతిథులను ఆకట్టుకునేలా ఉంది.
ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్, తన సతీమణి ప్రిసిల్లా చాన్, ఈశా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె-రణవీర్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్వప్, కియారా అడ్వాణీ, స్టార్ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ దంపతులు పాల్గొని సందడి చేశారు. సెలబ్రిటీస్ అంతా బ్లాక్ అవుట్ ఫిట్స్‌లో మెరిసిపోయారు.













