ముకేశ్ అంబానీ రూ.5 కోట్ల విరాళం
ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ దేవస్థానం బోర్డుకు ముకేశ్ అంబానీ కుటుంబం రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికి ఏర్పడిన ఆర్థిక నస్టాలను పూడ్చుకునేందుకు ఈ విరాళం అందించినట్లు పేర్కొంది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ మొత్తాన్ని అందజేసినట్లు దేవస్థానం బోర్డు అదనపు సీఈవో బి.డి.సింగ్ తెలిపారు. తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సహకరించాలని ముకేశ్ అంబానీకి విజ్ఞప్తి చేశామని, ఇందులో భాగంగానే పెద్ద మొత్తంలో విరాళం అందించారని సింగ్ వెల్లడించారు.













