అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్.. అతిథులకు 2500 రకాలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీ ఉన్న జామ్ నగర్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అతిథులకు వడ్డించేందుకు ఏకంగా 2,500 వంటకాలను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ప్రముఖ వ్యాపార వేత్త వీరెన్ మర్చంట్ కుమార్తె రాధికను అనంత్ అంబానీ వివాహం చేసుకోనున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు జరపనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు వెయ్యి మందికిపైగా ఈ వేడుకలకు హాజరకానున్నారు.
అతిథులకు మూడు రోజుల పాటు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 21 మంది చెఫ్‌లను ఇందు కోసం నియమించారు. ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా అనేక సంప్రదాయ వంటకాలను వడ్డీంచనున్నారు. బ్రేక్ ఫాస్ట్‌లో 75 రకాలు, లంచ్‌లో 225 రకాలు, డిన్నర్లో 275 రకాల వంటకాలను వడ్డించనున్నారు. మిడ్నైట్ స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. అర్థరాత్రి 12 నుంచి 4 గంటల వరకు 85 రకాల వంట్లకాల్లో ఏది కోరితే దాని మిడ్నైట్ స్నాక్స్‌గా అందించనున్నారు.













