అయోధ్యలో ఫ్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్
అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులు పాల్గొననున్నారు. క్రీడా, రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. ఈ వేడుకకు సంబంధించిన అతిథి జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. వీటన్నింటి మధ్య, బిగ్ బి అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ అనే సంస్థ ద్వారా ఆయన ఈ ప్లాట్‌ను కొనుగోలు చేశాడుఅమితాబ్ బచ్చన్ కొన్న ఈ ప్లాట్ 7 స్టార్ మల్టీ పర్పస్ ఎన్క్లేవ్ – ది సరయులో ఉంది. అయితే దీని ధరను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్లాట్ ధర రూ. 14.5 కోట్లుగా ఉంది. విస్తీర్ణం 10 వేల చదరపు అడుగులుగా ఉందట. అంటే ఒక్కో చదరపు గజానికి రూ.1.30 లక్షలన్న మాట.













