అమిత్ షా 3రోజుల కశ్మీర్ పర్యటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబర్ 23 నుంచి మూడు రోజుల పాటు కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా తొలిసారిగా కశ్మీర్ పర్యటనకు వెళ్తుండటం విశేషం. శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం అవుతున్న వేళ అమిత్ షా.. కశ్మీర్ లోయలో పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా అమిత్ షా కశ్మీర్లో అంతర్గత భద్రతను సమీక్షించనున్నారు. ఇటీవల పెరిగిన చొరబాట్లు, పౌరుల హత్యల నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పర్యటనలో అమిత్ షా కశ్మీర్ సర్పంచ్లతో సమావేశం కానున్నారు. త్వరలోనే కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.













