మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్‌షా
కొవిడ్ 19 నుంచి ఇటీవలే కోలుకొని ఇంటికొచ్చిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా ఆయాసం, ఒళ్లునొప్పులు ఉండటంతో ఆయన ఎయిమ్స్‌లో చేరారు. కొవిడ్ అనంతర వైద్యంకోసం ఆయన ఎయిమ్స్‌లో చేరారు. ఆయన సౌకర్యవంతంగా ఉన్నారు. ఎయిమ్స్ నుంచే అధికార విధులు నిర్వర్తిస్తున్నారు అని ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం చైర్పర్సన్ డాక్టర్ ఆర్తి విజ్ విడుల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అమిత్‌షా ఆగస్టు 2న కొవిడ్‌కు గురై గురుగ్రాం లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 14న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.













