భారత్‌కు సాయం చేయడానికి అమెరికా సిద్ధం : కమలా హార్యిస్
భారత్‌కు సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్ పేర్కొన్నారు. ఒహియోలోని సిన్సినాటిలో ఆమె మీడియాతో మాట్లాడారు. భారత్‌లో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయని అన్నారు. కొవిడ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయం అందించేందుకు కట్టబడి ఉన్నామని పేర్కొన్నారు. భారత్‌లో కరోనాతో చాలా మంది చనిపోతున్నారు. పీపీఈ కిట్లకు తదితరాలకు అమెరికా ఇప్పటికే సాయం చేసిందని పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా నుంచి సాయం అందండపై భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యులు, అధ్యక్షుడు జో బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.













